ఆ యాప్ ఫోన్ లో ఉందా ? అయితే మీ డేటా అంతా గల్లంతే.. !

cyber crime

స్మార్ట్ ఫోన్లలో సిస్టమ్ అప్ డేట్ ఫీచర్ ఉండటం సర్వ సాధారణం. ఫోన్లు వాడేవారికి అప్పుడప్పుడు కొత్త ఫీచర్ ను అప్ డేట్ చేసుకోమని నోఫికేషన్లు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ సిస్టమ్ పైనే కన్నేశారు సైబర్ నేరగాళ్లు. 'సిస్టమ్ అప్ డేట్' అనే పేరుతో ఓ మాల్వేర్ యాప్ కు రూపకల్పన చేసినట్లు సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఈ యాప్ ను ఒక్కసారి ఇన్ స్టాల్ చేసుకుంటే ఇక యూజర్ల ఫోన్లలో ఉన్న డేటా అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని, తమ ఫోన్లపై యూజర్లు నియంత్రణ కోల్పోతారని జింపీరియం అనే సైబర్ భద్రత సంస్థ వెల్లడించింది. యూజర్లను తమ బుట్టలో వేసుకునేందుకు ఈ సిస్టమ్ అప్ డేట్ ను ఎంచుకున్నారని, ఇది ఇన్ స్టాల్ చేసిన వెంటనే డేటా అంతా తస్కరించబడుతుందని సదరు సంస్థ తెలిపింది. 

ఈ మాల్వేర్ యాప్ ఒక్కసారి మీ ఫోన్లోకి వచ్చిందంటే చాలు.. హ్యాకర్లు ఎక్కడినుంచైనా  మీ ఫోన్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటారని చెప్తోంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్ డేట్ పేరుతో ఉండటం వల్ల యూజర్లు సులభంగా దానిని ఇన్ స్టాల్ చేసుకుని మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. జింపీరియం సీఈఓ మాట్లడుతూ.. సాధ్యమైనంత వరకూ థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోకపోవడమే మంచిదని తెలిపారు.