ఈ దేశాన్ని పరిపాలిస్తోంది ఎవరు? : ప్రముఖ డాక్టర్ గుప్తా

Delhi's Batra Hospital chief on oxygen deaths: 'I don't know who is running this country'

భారత్ లో రోజురోజుకు ఆక్సిజన్ సంక్షోభం తీవ్రమవుతోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో శనివారం 12 మంది రోగులు మరణించారు. సోమవారం, కర్ణాటక కోవిడ్ -19 ఆసుపత్రిలో కూడా చాలా మంది రోగులు మరణించారు. ఈ సంఘటనపై బాత్రా ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్సీఎల్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.. ఇది తా జీవితంలో చూసిన అతిపెద్ద విషాదాలలో ఒకటని అన్నారు.భారత్ లో ఆక్సిజన్ లేనందునే రోగులు చనిపోతున్నారని స్పష్టం చేశారు. 

కోవిడ్ -19 చికిత్సకు, ఆక్సిజన్, మందులు మరియు టీకా అవసరం.. దురదృష్టశావశాత్తు మనకు ఏదీ అందుబాటులో లేదు. మన దేశంలో ఆక్సిజన్ చాలా ఉందని ఓ వైపు ప్రభుత్వం చేబుతోంది.. కానీ రోగులు మాత్రం విపరీతంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని  పరిపాలిస్తోంది న్యాయవ్యవస్థ లేక కార్యనిర్వాహక వ్యవస్థా? తనకు అర్ధం కావడం లేదన్నారు. ఈ సంక్షోభ సమయంలో 15-20 నిమిషాల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి, తద్వారా అమాయక ప్రాణాలను కోల్పోకుండా చూసుకోవచ్చని ఆయన అన్నారు.