నటుడు దిలీప్ కుమార్ కు తీవ్ర అస్వస్థత

dilip-kumar-has-been-admitted-to-pd-hinduja-hospital-in-mumbai-after-breathing-issues

ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ (98) ఆరోగ్యం ఆదివారం అకస్మాత్తుగా క్షీణించింది. గత కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

కరోనా కారణంగా, దిలీప్ కుమార్ ఇద్దరు తమ్ముళ్ళు గత సంవత్సరం మరణించారు. ఆగస్టు 21 న, అస్లాం, 88 సంవత్సరాల వయస్సులో మరణించారు, ఆ తరువాత సెప్టెంబర్ 2న, 90 సంవత్సరాల వయసున్న మరో సోదరుడు ఎహ్సాన్ కన్నుమూశారు. ఈ కారణంగా, సైరా బాను మరియు దిలీప్ కుమార్ తమ 11 వ వివాహ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 11న జరుపుకోలేదు.