ఓ రేంజ్‌లో నవ్వుకున్నాం.. 'జాతిర‌త్నాలు'పై ఇండియ‌న్ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు

ఓ రేంజ్‌లో నవ్వుకున్నాం.. 'జాతిర‌త్నాలు'పై ఇండియ‌న్ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్ర‌ధారులుగా అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రం 'జాతి రత్నాలు. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లై.. విమ‌ర్శ‌లు ప్ర‌శంస‌లూ పొందింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా న‌ట‌న అద్భుతం. ఈ సినిమాలోని చిట్టి సాంగ్ చాలా ఫేమ‌స్ అయ్యింది.    ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనూ సందడి చేస్తూ ప్రముఖులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ సినిమాను ఇండియన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చూశాడు. చిత్రంపై అభినందనజల్లులు కురిపించాడు.  జాతి రత్నాలు సినిమా చూసి ఓ రేంజ్ లో నవ్వుకున్నాం.. ప్రతి సన్నివేశానికి నవ్వు ఆపుకోలేక పోయాం. అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్‌, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు తీయడం చాలా కష్టమని కానీ వీరు మాత్రం అవుట్ స్టాండింగ్ జాబ్ అందించారని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.