రంగం దర్శకుడు హఠాన్మరణం

directer K. V. Anand passes away

తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కెవి ఆనంద్ గుండెపోటుతో శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.. ఫోటో జర్నలిస్టుగా తన వృత్తిని ప్రారంభించిన కెవి ఆనంద్ గోపురా వాసలీలే, మీరా, దేవర్ మగన్, అమరన్, తిరుడా తిరుడా వంటి చిత్రాలలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్‌కు సహాయంగా పనిచేశారు. 1994 లో మలయాళ చిత్రం తెన్మావిన్ కొంబాత్ కోసం శ్రీరామ్ తన పేరును సిఫారసు చేయడంతో.. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేశారు.. ఇందులో ఆనంద్ చూపిన ప్రతిభకు జాతీయ చిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు.

మిన్నారామ్, చంద్రలేఖ, ముధల్వన్, జోష్, నాయక్, బాయ్స్, ఖాకీ, శివాజీ వంటి చిత్రాలలో పరిశ్రమలలో పనిచేస్తూ, ఒక దశాబ్దం పాటు సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ తరువాత,  2005 లో కన కందెన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరివాత అయాన్, కో, మాట్రాన్, అనెగాన్, కవన్, రంగం, కప్పాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కెవి ఆనంద్ మరణ వార్త ఆన్‌లైన్‌లో వెలువడిన వెంటనే, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నష్టానికి సంతాపం తెలిపారు.