కరోనాతో టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

director-kumar-vatti-passed-away-due-to-corona

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి డైరెక్టర్ మరణించారు. కొన్నిరోజుల ముందు డైరెక్టర్ కుమార్ వట్టికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరారు.. అయితే ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. అవివాహితుడైన ఆయన వయసు 39 సంవత్సరాలు. కుమార్ వట్టి మా అబ్బాయి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కుమార్ వ‌ట్టి స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లాలోని న‌ర్స‌న్న‌పేట‌. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర యువత సినిమాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు. 2017లో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా మారారు.