కరోనా ఎఫెక్ట్ : Disney+ Hotstar లాంచ్ ఆలస్యం..

కరోనా ఎఫెక్ట్ : Disney+ Hotstar లాంచ్ ఆలస్యం.. మరి ఎప్పుడంటే?

 

భారతదేశంలో కరోనా వ్యాప్తి ప్రభావంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) క్రికెట్ సీజన్ వాయిదా పడింది. దీని కారణంగా డిస్నీ ప్లస్ (Disney+) Hotstar లాంచ్ కూడా ఆలస్యం అవుతోంది. హాట్ స్టార్ ఒక అప్ డేట్ రూపొందించింది. యాప్ పేరును డిస్నీ+ హాట్ స్టార్‌గా మార్చడమే కాకుండా డిస్నీ+ షోలను కూడా యాడ్ చేస్తోంది. 

"ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సీజన్ ప్రారంభంతో కలిసి డిస్నీ+ హాట్ స్టార్ సర్వీసు ద్వారా భారతదేశంలో ప్రారంభమవుతుందని ఇటీవల ప్రకటించాము" అని వాల్ట్ డిస్నీ కంపెనీ APIC అధ్యక్షుడు, స్టార్ & డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. "సీజన్ ఆలస్యం కారణంగా, డిస్నీ+ లాంచ్‌పై నిర్ణయం తీసుకున్నాం. సర్వీసు కోసం కొత్తగా సవరించిన ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటిస్తాము" అని ఆయన చెప్పారు. 

అప్పటి డిస్నీ చైర్మన్, CEO అయిన రాబర్ట్ ఇగెర్ మార్చి 29 భారతదేశంలో డిస్నీ+ అధికారిక ప్రారంభ తేదీగా ప్రకటించారు. గత నివేదికల ప్రకారం.. డిస్నీ + హాట్ స్టార్ ప్రస్తుతం ఉన్న హాట్ స్టార్ సబ్ స్ర్కైబర్లకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంది. సంవత్సరానికి 999 రూపాయలు చెల్లిస్తారు.  ప్రీమియం టైర్ కొత్త వార్షిక స్టిక్కర్ ధర 3,588 రూపాయలగా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. 

ది మాండలోరియన్, మార్వెల్ హీరో ప్రాజెక్ట్, ది ఇమాజినరింగ్ స్టోరీ: లిమిటెడ్ సిరీస్ వంటి షోలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో డైరీ ఆఫ్ ఎ ఫ్యూచర్ ప్రెసిడెంట్, డిస్నీ ఫ్యామిలీ సండేస్, ఎంకోర్, ఫోర్కీ ఆక్స్ ఎ క్వశ్చన్, హై స్కూల్ మ్యూజికల్: ది మ్యూజికల్ వంటి షోలను వీక్షించవచ్చు. ఈ ఏడాదిలో కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీసులను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు టెక్ క్రంచ్ నవంబర్ నెలలో నివేదించింది, తరువాత ఆగ్నేయాసియా మార్కెట్లలో ప్రవేశించింది. డౌన్‌లోడ్‌ల విషయానికొస్తే, డిస్నీ+ రెండవ నెల ప్రారంభమైనప్పటి నుండి చూసిన 40.9 మిలియన్ ఇన్‌స్టాల్‌లలో 13.5 మిలియన్లు లేదా 33 శాతం ఆర్జించింది. 

ఇంతలో, హాట్ స్టార్, గరిష్ట స్థాయిలో, గత సంవత్సరం 100 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను మరియు 300 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు నివేదించింది. మీడియా నివేదికల ప్రకారం.. కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చేసే ప్రయత్నంలో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ రెండూ కొన్ని ప్రాజెక్టులపై ప్రొడక్షన్ నిలిపివేశాయి.