స్టాలిన్ అనే నేను..

DMK chief MK Stalin takes oath as the Chief Minister of Tamil Nadu

తమిళనాడు ముఖ్యమంత్రిగా డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. 68 ఏళ్ల స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి సీఎం పీఠమెక్కారు. రాష్ట్రంలో కోవిడ్ -19 సెకండ్ వేవ్ నేపథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐఎడిఎంకె నాయకుడు ఓ పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ నుంచి పి చిదంబరం, ఎండిఎంకె చీఫ్ వైకోతో పాటు కూటమికి చెందినవారు పాల్గొన్నారు. 

స్టాలిన్‌తో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులలో 19 మంది మాజీ మంత్రులు, 15 మంది కొత్త వారు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో 2021 లో డిఎంకె చీఫ్ పార్టీని భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.