రాజస్థాన్‌లో రెండోసారి భూకంప ప్రకంపనలు

earthquake-in-bikaner-rajasthan

గురువారం ఉదయం రాజస్థాన్‌లోని బికానెర్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని పరిమాణం రిక్టర్ స్కేల్‌పై 4.8 గా ఉంది. ఉదయం 7.42 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో బికానెర్కు వాయువ్యంగా 413 కిలోమీటర్లలో ఉందని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరగలేదు. అంతకుముందు బుధవారం కూడా బికానెర్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత  రిక్టర్ స్కేల్‌పై 5.3 గా నమోదు అయింది.