నల్ల జాతీయుడు ఫేస్‌బుక్‌ కి బహిరంగ లేఖ

0
280
facebook and its black people problem

ఫేస్‌బుక్‌ సంస్థకి మాజీ ఉద్యోగి ఒకరు బహిరంగ లేఖ రాశారు. నల్ల జాతీయుల్ని ఉద్యోగంలో నియమించుకునేందుకు, తమ నెట్‌వర్క్‌లో చేర్చుకునేందుకు ఫేస్‌బుక్‌ ఆసక్తి చూపడం లేదని మార్క్‌ లూకీ అనే నల్ల జాతీయుడు వెల్లడించారు. స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌ మేనేజర్‌గా ఆయన ఈ నెలలో రాజీనామా చేయడానికి ముందు ఈ లేఖను ఫేస్‌బుక్‌ ఉద్యోగులందరితో పంచుకున్నారు.

సోషల్‌ నెట్‌వర్క్‌లో నల్ల జాతీయులే ఎంతో ఆసక్తిగా ఉంటున్నారని, సమాచార గోప్యతకు వారు చేస్తున్న ప్రయత్నాల్ని ఫేస్‌బుక్‌ పట్టించుకోవడం లేదని తెలిపారు. అసలు నల్ల జాతీయులు తమ సంస్థలో పనిచేస్తున్న సంగతినే చాలా మంది ఉద్యోగులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లూకీ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించింది.