బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం..!!

0
196
Hyderabad

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా విక్రయిస్తున్న షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాణాసంచా అమ్ముతున్న యజమాని సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.