కరోనాతో మాజీ క్రికెటర్ కన్నుమూత

Former cricketer died with Corona

సౌరాష్ట్ర క్రికెట్ క్రీడాకారులలో ఒకరైన రాజేంద్రసిన్హ్ జడేజా అకాల మరణానికి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) ఆదివారం సంతాపం తెలిపింది. కోవిడ్ -19 తో పోరాడుతూ రాజేంద్రసిన్హ్  ఆదివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కుడిచేతి మీడియం పేసర్ అయిన రాజేంద్రసిన్హ్ 1974-75 నుండి 1986-87 మధ్య అనేక అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. 

రాజేంద్రసిన్హ్ 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు,11 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో పాల్గొన్నారు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 134 వికెట్లు, లిస్ట్ ఎ క్రికెట్‌లో 14 వికెట్లు తీసుకున్నారు. అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 1536 పరుగులు, లిస్ట్ ఎ గేమ్స్‌లో 104 పరుగులు చేశారు.

క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్  ఒక ప్రకటన విడుదల చేసింది.