బాల‌య్య‌కు యువ‌రాజ్ సింగ్ బ‌ర్త్ డే విషెస్

former-cricketer-yuvraj-singh-birthday-wishes-hero-balakrishna

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు.. అందులో ఇలా పేర్కొన్నారు.. 'హ్యాపి బర్తడే నందమూరి బాలకృష్ణ సార్‌. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా.. ఇవే మీకు నా బెస్ట్‌ విషెస్‌.' అంటూ ట్వీట్‌ చేశాడు.