కరోనాతో మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ తండ్రి కన్నుమూత

Former India fast bowler RP Singh's father Shiv Prasad passes away due to Covid-19

కోవిడ్ -19 కారణంగా భారత క్రికెట్ మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ ప్రసాద్ సింగ్ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి శివ ప్రసాద్ సింగ్  కోవిడ్ -19 తో బాధపడుతున్నాడని.. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచి స్వర్గానికి వెళ్లాడని ఆర్పీ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 2007లో భారత్‌ టి20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న టీంలో ఆర్‌పి సింగ్ ఉన్నారు,

14 టెస్టులు, 58 వన్డే ఇంటర్నేషనల్స్, 10 ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2018 లో 32 సంవత్సరాల వయస్సులో పదవీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్నారు. సీనియర్ జాతీయ జట్టుకు సెలక్షన్ కమిటీ సభ్యులను ఎన్నుకునే క్రికెట్ సలహా కమిటీలో కూడా ఆర్పీ సింగ్ ఉన్నారు.