మైసూరారెడ్డికి రహస్య అజెండా ఉంది : శ్రీకాంత్‌రెడ్డి

gadikota-srikanth-reddy-fires-chandrababu-naidu

తెలంగాణ ఇష్టానుసారంగా నీటిని తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడ దాక్కున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌లో సంసారం ఉన్నారు కాబట్టి కేసీఆర్‌కు భయపడ్డారా.. అని ప్రశ్నించారు. మైసూరారెడ్డికి రహస్య అజెండా ఉందని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి రాయలసీమకు నీళ్లు ఇవ్వడంతోపాటు,

ప్రకాశం జిల్లాలో ఆయకట్టును స్థిరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే మైసూరా లాంటివాళ్ల చేత చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారని  ఎద్దేవా చేశారు. రాయలసీమ డ్రాట్‌ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తే.. మైసూరాలాంటి వారు సలహాలు, సూచనలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే కుట్రతోనే వీరంతా కూడబలుక్కొని తెలంగాణకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.