పరారీలో ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి ..!!

0
127
Gali Janardhana Reddy

గాలి జనార్ధన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గాలిని పట్టుకోడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందు కోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది