సీనియర్ జార్జ్ బుష్ కన్నుమూత

0
299
Senior-George-HW-Bush

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ. బుష్‌(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. జార్జ్ డబ్ల్యు బుష్ అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన భార్య బార్బరా మృతి చెందిన వారం రోజులకు ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.సీనియర్ బుష్‌కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.