గుగూల్ కు గ్ర‌హ‌ణమా! 10 నిమిషాల పాటు అంతరాయం!

గూగుల్ సేవల్లో అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం​ గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.   గూగుల్, జీమెయిల్, యూట్యూబ్ లాంటి గూగుల్ యాప్స్, వెబ్ సైట్ల‌ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్‌ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్‌‌,  ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. కాగా, సేవల అంతరాయంపై గూగుల్‌ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్‌ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. వరల్డ్ వైడ్ గా ఈ ప్రాబ్లం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే సెర్చ్ ఇంజిన్ మాత్రం పనిచేస్తోంది. సర్వీస్ డౌన్ కావడంపై గూగుల్ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. ఏ కారణంగా యాప్స్ రెస్పాండ్ కావడంలేదనేది తెలియరావడంలేదు. దీంతో సోషల్ మీడియాలో గూగుల్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.