త్వరలోనే మూసేస్తున్న గూగుల్ ప్లస్

0
158
google plus will be shut down

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్‌ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్‌ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్‌ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్‌ ప్లస్‌ కార్పొరేట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్‌ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్‌ తెలిపింది.

google plus will be shut down after data was exposed