గుత్తా జ్వాల - విష్ణు విశాల్ పెళ్లి డేట్ ఫిక్స్ !

Gutta Jwala - Vishnu Vishal Marriage

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల - తమిళ నటుడు విష్ణు విశాల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ.. త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని తెలిపారు. చెప్పినమాట ప్రకారమే.. తమ పెళ్లి తేదీని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు గుత్తా జ్వాల - విష్ణు విశాల్. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటున్న తమకు.. చెప్పలేనంత సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో అతికొద్ది మందినే వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.