వేసవిలో కేశ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

hair care tips

వేసవికాలం వచ్చిందంటే మీ జుట్టు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంతిహీనంగా, చిక్కులతో ఎండిపోయి ఉన్న జుట్టును ఏ మహిళ కోరుకోదు. మృదువైన, పెట్టులాంటి ఆరోగ్యకరమైన జుట్టు మీ అందాన్ని ఇనుమడింపజేస్తుంది. నిజానికి సూర్యుడి వల్ల జుట్టు పాడవ్వదు కానీ.. ఎండలో తిరగడం వల్ల జుట్టుపై ఉండే సన్నటి పొర దెబ్బతింటుంది. తేమవలన కేశాలలోని హైడ్రోజన్ బంధాలు, లవణ బంధాలు కొంతవరకు దెబ్బతింటాయి. అలా జుట్టు పాడవ్వకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. చాలా మంది తలస్నానం చేశాక డ్రయ్యర్లు ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల జుట్టుకు మరింత నష్టం జరుగుతుంది. అలాగే కర్లర్లు వాడటం వల్ల కూడా జుట్టు బాగా రాలిపోతుంది. అంతగా తప్పదనుకుంటే వేడి గాలి వచ్చే డ్రయ్యర్లు కాకుండా.. చల్లగాలి వచ్చే డ్రయ్యర్లను వాడటం మంచిది. 

2. తలస్నానం చేసేటప్పుడు బాగా వేడినీరు, బాగా చల్లటి నీరు కాకుండా.. గోరు వెచ్చగా ఉన్న నీటితో చేయడం ఉత్తమం. బాగా వేడినీటితో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు బాగా రాలిపోతుంది. 

3. జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి. వేసవి కాలంలో చివళ్ల సమస్య బాగా ఉంటుంది. వాటిని అలాగే వదిలేస్తే.. జుట్టు మరింత తెగిపోతుంటుంది. అందుకే ప్రతి 4 - 6 నెలలకోసారి జుట్టు చివళ్లను కత్తిరించుకోవాలి. 

4. రెండు గుడ్లలోని పచ్చసొనలో ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట లేదా గంటన్నర సేపు ఆరనివ్వాలి. తర్వాత కండీషనర్ తో చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 

5. ఈరోజుల్లో జుట్టుకు నూనె రాసుకునేవారు చాలా తక్కువ. అందుకే శిరోజాలు పొడిబారి.. అందవిహీనంగా.. కాంతి రహితంగా తయారవుతాయి. వారానికి ఒకసారిగా జుట్టుకు పూర్తి నూనెను పట్టించాలి. మర్నాడు తలస్నానం చేస్తే.. జుట్టు మెత్తగా తయారవుతుంది. 

6. తలలో వేడి ఎక్కువైనా జుట్టు బాగా రాలిపోతుంటుంది. అప్పుడప్పుడు తలకు నిమ్మరసం, పెరుగు పెట్టుకోవడం మంచిది. అది ఆరాక తలస్నానం చేస్తే.. కాస్త రిలీఫ్ గా ఉంటుంది.