పడుచుపిల్ల పుట్టినరోజు హన్సిక మొత్వాని

0
105
hansika bithday

చిన్న వయసులో తెలుగు పరిశ్రమకి ఆరంగ్రేటం చేసిన హన్సిక మొదటి సినిమా దేశముదురు తో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలతో వరస అవకాశాలు రానే వచ్చాయి, కంత్రి, మస్కా లాంటి సినిమాలతో తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా చేసి మంచి పేరుని సాధించింది.
హన్సిక ఆగస్టు 9, 1991 (age26) ముంబై మహారాష్ట్ర లో జన్మించింది. హన్సిక చిన్నతనంలోనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రారంభించింది. షకలక బూమ్ బూమ్ సీరియల్ లో ఒక చిన్న పాత్ర పోషించి తర్వాత దేశమే నిక్లా హోగా చాంద్ సీరియల్ లో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన కోయీ మిల్ గయా సినిమాలో ప్రీతిజింతా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన హన్సిక, తాను పదవ తరగతి చదువుతుండగానే పూరీ జగన్నాథ్ తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు. దేశముదురు సినిమా తర్వాత ఇప్పటివరకు హన్సిక దాదాపు 45 సినిమాల్లో నటించింది,

మరెన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే హన్సిక మోత్వాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here