హెచ్‌సీఏలో సద్దుమణిగిన వివాదం.. సయోధ్య కుదిర్చిన కవిత?

 HCA controversy over

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు తిరిగింది. వివాదానికి టీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్ పెట్టారు. దీంతో అజర్‌, జాన్‌ వర్గాల మధ్య వివాదం సద్దు మణగడంతో ఈ రోజు జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు హెచ్‌సీఏ ప్రకటన చేసింది. 

హెచ్‌సీఏలో అజర్‌, జాన్‌ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చారు. ప్రస్తుత కార్యవర్గం కదలికలపై సమాచారమందుకున్న మాజీలు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్‌కు తో పాటు ఈ భేటీకి శివ్‌లాల్‌ యాదవ్‌, శేష్‌నారాయణ, యాదగిరి, చిట్టి శ్రీధర్‌ తదితరులు 
కవిత సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది.