ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

heavy-rains-5-districts-andhra-pradesh

ఏపీలో గురు, శుక్రవారాల్లో ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురుస్తాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకూ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది.