ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి

High Court approves Eluru Municipal Corporation counting

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ తీర్పు చెప్పింది. కాగా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని ఎన్నికలు నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం యధావిధిగానే జరిపి లెక్కింపు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం తుది తీర్పు వెల్లడించిన న్యాయస్థానం కౌంటింగ్ కు పచ్చజెండా ఊపింది.