ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

high-court-green-signal-counting-mptc-and-zptc-votes-ap

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు జరపవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ నేత వర్ల రామయ్య విజ్ఞప్తిని తిరస్కరించి ప్రభుత్వ వాదనను సమర్ధించింది. కాగా హైకోర్టు తీర్పుతో ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చెయ్యాలని ఆమె జిల్లా కలెక్టర్లు,ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా గత నెల 8వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ జరపలేదు.తాజాగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవవడంతో అభ్యర్థుల్లో నెలకొన్న సందిగ్దత తొలగినట్టయింది.