బాలయ్యను చుట్టుముట్టీ మండిపడిన హిందూపూర్ మహిళలు

0
421

మొన్నటి దాకా టిక్కెట్టు వస్తుందా, రాదా అన్నటెన్షన్… ఆ తర్వాత టిక్కెట్ కన్ఫరమేషన్. ఇదీ నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుత రాజకీయ పరిస్తితి. ఎట్టకేలకు హిందూపూర్ అసెంబ్లీ సీటు ఖరారు అవ్వడంతో బాలయ్య అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం ఉప్పొంగుతోంది. అయితే హిందూపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం బాలక్రిష్ణ మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టిక్కెట్ ఖరారైన తర్వాత బాలక్రిష్ణ హిందూపురం వెళ్లారు. ఆయన వచ్చిన విషయం తెల్సుకున్న మహిళలు… లేపాక్షి సర్కిల్ దగ్గర బాలయ్యను చుట్టుముట్టారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు తమ నియోజకవర్గానికి వచ్చారని మహిళలు ప్రశ్నించారు.

తమ సమస్యలు వదిలేసి, అప్పుడప్పుడూ చుట్టం చూపుగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేస్తే, తమ సమస్యలు తీరవని చెప్పారు. హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పి… చిన్న చెరువులను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. తాము తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతుంటే… చుట్టం చూపుగా వస్తారా అంటూ బాలయ్య మీద మహిళలు మండిపడ్డారు. తమ సమస్యలు చెబుదామంటే, మీరు హైదరాబాద్ లో ఉంటారనీ, అక్కడికి వచ్చి మిమ్మలను కలవడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.

మహిళల నుంచి నిరసన ఎక్కువ అవ్వడంతో టీడీపీ కార్యకర్తలు జై బాలయ్య అంటూ నినాదాలు చేసి… టాపిక్ డైవర్ట్ చేసే యత్నం చేశారు. కానీ మహిళలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో నోరు మెదపడానికే బాలయ్య భయపడ్డారని హిందూపురం జనం అంటున్న మాట. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాలక్రిష్ణ… తన పీఏగా శేఖర్ హిందూపురంలో నియమించారు బాలయ్య. ప్రజా సమస్యలు, అభివ్రుద్ధిపై ద్రుష్టి పెట్టాలని ఆదేశించారు. కానీ శేఖర్ టీడీపీ పరువు, బాలక్రిష్ణ పరువు తుంగలో కలిపారు. కాంట్రాక్టర్లను బెదిరించడంతో పాటు టీడీపీలో గ్రూపులు తయారు చేశారు. ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ అవ్వడంతో… శేఖర్ ను పీఏగా తొలగించారు బాలయ్య. అయితే అప్పటికే హిందూపురంలో టీడీపీ మీద జనానికి నమ్మకం పోయిందనీ ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట. డ్యామేజి జరిగిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. తాజాగా మహిళల నిరసనే అందుకు ఉదాహరణగా భావిస్తున్నారు స్థానికులు.