*హిట్ * రివ్యూ

 *హిట్ *  రివ్యూ

 

బ్యానర్  : వాల్ పోస్టర్ సినిమా
సమర్పణ :  నాని
నిర్మాత  : ప్రశాంతి త్రిపురనేని
దర్శకుడు : శైలేష్ కొలను
కెమెరా  : మణికందన్
సంగీతం : వివేక్ సాగర్.

నటులు : విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, బ్రహ్మజీ, బానుచందర్, హరితేజ

 

కథ ఒక్క ముక్కలో...

విక్రమ్ (విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్). రింగ్ రోడ్డు దగ్గర ఒక అమ్మాయి మిస్ అవుతుంది, అలాగే తన గర్ల్ ఫ్రెండ్(రుహానీ శర్మ) కిడ్నాప్ అవుతుంది రెండు కేసులని హీరో ఎలా డీల్ చేసాడు.

 

విషయానికి వస్తే..


ఈ హిట్ అనే సినిమా ఆమాత్రం బజ్ క్రియేట్ అవ్వడానికి ఒకేఒక్క కారణం, నేచురల్ స్టార్ నాని నిర్మాత అవ్వడం. తన వాల్‌పోస్టర్ బ్యానర్ పై రెండో సినిమాగా ఈ హిట్ సినిమాని నిర్మించడం. మొదటి సినిమా గా తీసిన 'అ' ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్‌ లో మాత్రమే ఆడి మిగతా జనాలకు అర్థం కాలేదు. ఈ సారి రెండో సినిమా.. ఏ ఆడియన్స్ తో పాటు..  బి, సి  జనాలని కూడా దృష్టిలో పెట్టుకుని తీసి ఉంటాడని ఎక్స్ పెక్ట్ చేస్తాం.. ఎందుకంటే నాని అష్టా చమ్మా, భీమిలి కబ‌డ్డీ జట్టు, పిల్ల జమిందార్ ఇలా అన్ని వర్గాలని మెప్పించి నేచురల్ స్టార్ అయ్యాడు. కానీ నిర్మాతగా మారేసరికి కేవలం ఒక రకం ప్రేక్షకులని మాత్రమే మెప్పించే సినిమాలు తీస్తున్నాడు. 

ఈ హిట్ సినిమా విషయానికి వచ్చేసరికి మాటలు తెలుగులో ఉన్నా ఎక్కడా తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. షాట్ ఫిల్మ్ కి ఎక్కువ వెబ్ సిరీస్ కి త‌క్కువలా అనిపిస్తుంది. దర్శకుడికి పక్కా హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువ అనుకుంట. సినిమాలో హరితేజని ఇంటరాగేషన్ చేస్తున్నపుడు మధ్యలో  ఆఫీసర్ సిగరెట్ ఇచ్చి మరీ లైటర్ తో వెలిగిస్తాడు. ఇలాంటివి హాలీవుడ్ పోలీసులు చెయ్యొచ్చు. మన తెలుగు పోలీసులు చేసే అవకాశం లేదు. షాట్స్ లో కూడా ఇంగ్లీష్ సినిమాల‌ ప్రభావం ఎక్కువ. హాలీవుడ్ లో పాయింట్ చిన్నది తీసుకుని గంటన్నర లోపు తీస్తారు కాబట్టి లాగ్ అనిపించదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రెండు గంటల పాటు ఒక చిన్న పాయింట్ ని లాగటం.. నెరేషన్ స్లో గా ఫ్లాట్ గా ఉండడం, టోటల్ గా ఈ కిడ్నాప్, మర్డర్ చేసింది ఎవరంటే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఉంటుంది క్లైమాక్స్. మొత్తం మీద సినిమా రెండుగంటలు అయినప్పటికీ ఎన్నో గంటలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్య మధ్యలో హీరోకి హీరోయిన్ కి మధ్య రొమాంటిక్  సీన్స్ వేస్తే రొటీన్ గా ఉంటుంది అనుకున్నాడేమో.. రొమాంటిక్ షాట్స్ వేసాడు దర్శ‌కుడు, అలాగే మధ్య మధ్యలో తన గతానికి సంబంధించి టెన్షన్ పడుతున్నట్టు షాట్స్ వేసి గందరగోళం కి గురిచేస్తాడు.
  
కారణం చెప్తే ప్రేక్షకులకు ఎక్కడ నచ్చేస్తుందని భయపడి ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ కూడా వదిలేసాడు. 
కిడ్నాప్, మర్డర్ చేసింది ఎవరో రివీల్ చేసాక కూడా ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నించి విసుగు తెప్పించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో విశ్వక్ సేన్ కి ఇంతవరకూ ఒక్క హిట్టు కూడా లేదు, ఈ సినిమాతో కొడతాడాని అనుకున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. సినిమాలో అదిరిపోయేంత   గొప్ప యాక్టింగ్‌ చెయ్యలేదు గానీ పర్వాలేదు అనిపించాడు.  హీరోయిన్ కొంత సినిమా తర్వాత ఎలాగూ కనిపించదు కాబట్టి నటించడానికి పెద్ద స్కోప్ లేదు. మురళీ శర్మ ని పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లోనే అద్భుతంగా వాడతారు. అతన్ని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు, మిగతా ఆర్టిస్ట్ ల గురించి చెప్పడానికి ఏం లేదు. కెమెరా వర్క్ బాగుంది నేచురల్ గా బ్లాక్స్ పెట్టాడు.
రీ రికార్డింగ్ వివేక్  సాగర్ బాగానే చేసాడు. నిర్మాణ విలువలు గురించి చెప్పడానికి ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలానే  ఉన్నాయి. హిట్ అని పోస్టర్ మీద టైటిల్ చూసి లోపల కూడా హిట్ అని ఎక్స్ పెక్ట్ చెయ్యడం అంటే పేపర్ మీద పంచదార అని రాసి తియ్యగా ఉందా అని అడగడం లాంటిదే.. మొత్తానికి అక్కడక్కడ పర్వలేదనిపించినా పూర్తి స్థాయిలో ఐతే మెప్పించకపోవచ్చు.

చివరగా...
వీళ్ళు కొట్టిన హిట్టు కి థియేటర్ లో దోమలు చచ్చే అవకాశం ఎక్కువ, ప్రేక్షకులు మెచ్చే ఛాన్స్ తక్కువ.

రేటింగ్ : 2.0