ఫైర్‌క్రాకర్ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు

Huge blast at firecracker factory in Maharashtra's Dahanu, 10 workers injured

మహారాష్ట్రలోని ఫైర్‌క్రాకర్ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. సుమారు 10 మంది కార్మికులు కాలిన గాయాలతో బయటపడ్డారు..  వారిని దహను కాటేజ్ ఆసుపత్రికి తరలించారు. పాల్ఘర్ జిల్లాలోని దేహనే గ్రామంలోని విశాల్ బాణసంచా కర్మాగారం వద్ద గురువారం ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న దహను పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, రెండు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలు ఆర్పారు. 

పేలుడు జరిగినప్పుడు యూనిట్ లోపల 100 మందికి పైగా కార్మికులు ఉన్నారు. దహను ఎమ్మెల్యే వినోద్ నికోలే పేలుడు జరిగిన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కర్మాగారంలో ప్రస్తుతం వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని, ఇది మంటలకు దారితీసిందని చెప్పారు. దాదాపు 25 ఏళ్ల యూనిట్ అయిన విశాల్ బాణసంచా కర్మాగారం జరిగిన ఈ పేలుడు చాలా శక్తివంతమైనదని, పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు వినిపించిందని ఎమ్మెల్యే నికోల్ చెప్పారు.