పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయాలని భారత్ నిర్ణయం

icc-world-t20-government-decides-to-give-visas-to-pakistani-players

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఐసిసి ప్రపంచ టి 20 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారత్ రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాకిస్తాన్ ఆటగాళ్లకు, మీడియాకు వీసాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశం ద్వారా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అపెక్స్ కౌన్సిల్‌కు సమాచారం ఇచ్చింది. బోర్డు కార్యదర్శి జే షా స్వయంగా అపెక్స్ కౌన్సిల్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసా అనుమతి లభించింది. అయితే, అభిమానులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. 

కాగా ఈ విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.. వర్చువల్ సమావేశంలో పాల్గొన్న బిసిసిఐ అధికారి మాట్లాడుతూ.. టి 20 ప్రపంచ కప్ ఐసిసి ఈవెంట్ అని.. ఈ దృష్ట్యా, పాకిస్తాన్ ఆటగాళ్ళు మరియు ఆ దేశ మీడియా కోసం వీసాలను ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. అంతకుముందు మార్చి 31 లోగా పాకిస్తాన్ జట్టుకు వీసా ఆమోదం గురించి బిసిసిఐ తన వైఖరిని తెలపాలని పిసిబి చైర్మన్ ఎహ్సాన్ మణి అల్టిమేటం జారీచేశారు.