టీఆర్‌ఎస్‌ ఓడిపోతే నేను రాజకీయాల్లో కనబడను, వినబడను…!!

0
179
ktr

‘‘టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లేకపోతే,నేను రాజకీయాల్లో కనబడను, వినబడను. మళ్లీ ప్రజల ముందుకు రాను. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము, ధైర్యం పీసీసీ అధ్యక్షుడికి కానీ, విపక్ష నాయకులకు కానీ ఉందా!?’’ అని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు సర్వేల్లో ఆరింటిలో టీఆర్‌ఎ్‌సకే అధికారమని స్పష్టమైందన్నారు. ఈ ఎన్నికలు నాలుగేళ్ల మూడు నెలల టీఆర్‌ఎస్‌ పాలనకు రిఫరెండమన్నారు. టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని, ఆ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తే 100కుపైగా స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేస్తామని చెప్పారు. మిగిలిన సీట్లలోనూ గెలవలేరన్నారు. టీఆర్‌ఎస్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకోనుందని, ఇది తన ఆత్మ విశ్వాసమని చెప్పారు. కొందరు అహంకారంతో మాట్లాడుతున్నానని విమర్శించవచ్చు కూడానని అన్నారు