ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి

ilayaraja-king-of-realism-art-passes-away-due-covid-19-second-wave-coronavirus

ప్రముఖ చిత్రకారుడు ఇలయరాజా మరణించారు.  కరోనా సోకడంతో ఆయన మరణించారని కుటుమ్బసభ్యులు తెలిపారు. ఇటీవల  తన మేనకోడలు వివాహానికి హాజరయ్యి చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో జలుబు చేయడంతో మందులు వాడారు.. కానీ రోజులు గడిచేకొద్దీ ఆయన ఆరోగ్యం విషమించింది. చెన్నై ఎగ్మోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో చికిత్స చేస్తున్నారు.  అయితే ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి సీఎం స్టాలిన్,  నటుడు దర్శకుడు పార్తిబన్, పా.రంజిత్‌   సంతాపం వ్యక్తం చేశారు.