శుభవార్త : నైరుతి ముందే వచ్చేస్తుంది.. ఈ ఏడాది 98 శాతం వర్షపాతం అట

imd-says-southwest-monsoon-ti-hit-kerala-coast-in-time

భారత వాతావరణ శాఖ చల్లని కబురుచెప్పింది. దేశంలో 80 శాతం వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికంటే ముందే వస్తాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ వెల్లడించారు. యథావిధిగా వచ్చే నెల (జూన్) 1న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. రుతపవనాల ఆగమనంపై అధికారికంగా మే 15న ప్రకటన ఉంటుందని తెలిపారు. 

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సమయంలో నమోదయ్యే వర్షపాతం గురించి మే 31న వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా నైరుతి రుతుపవనాల కారణంగా వరుసగా  మూడో ఏడాది సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని స్పష్టం చేశారు. కాగా ఈ నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చని  రాజీవన్ పేర్కొన్నారు.