ఒక్క వీడియో ఆధారంగా కీలక మలుపు తిరిగిన ఓటుకు కోట్లు కేసు!

0
188

ఓటుకు కోట్లు కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికాయంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖ కథనం ప్రచురించింది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు… హైదరాబాద్ తార్నాకలోని మాల్కం టేలర్‌ అనే వ్యక్తి  ఇంట్లో అప్పట్లో తీసిన ఓ వీడియో తాజాగా బయటపడింది. 11 నిమిషాలున్న ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన బేరసారాలు స్పష్టంగా ఉన్నాయి. స్టీఫెన్ సన్ తో ఐదు కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నట్లు, కొంత మొత్తంలో డబ్బులు కూడా ఇస్తున్నట్లు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ మొత్తాన్నీ టీడీపీ స్టీఫెన్ సన్ కు ఆఫర్ చేసినట్లు తేలిపోయింది. అడ్వాన్స్‌గా 50 లక్షలు ఇవ్వడానికి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్‌ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది.

ముందుగా 3 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చేటట్లూ… డీల్ ఓకే అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేటట్లు ఈ వీడియో ద్వారా అర్థం అవుతోంది. మిగిలిన డబ్బుకు తాను హామీగా ఉంటానన్న సెబాస్టియన్ డైలాగ్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ వీడియోలో బాబు గారు అంటూ రెండు, మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడేనని స్పష్టంగా తేలింది. టీడీపీ నేతలు ఇదంతా అబద్దమన్నా… గతంలో చంద్రబాబు ‘బ్రీఫ్ డ్ మీ’ సంభాషణ ఈ వీడియోకు మరింత బలం చేకూరుస్తోంది. మొత్తానికి ఈ తాజా వీడియో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు… టీడీపీ పార్టీ నేతలను ఇరకాటంలో పెడుతోంది. ఎన్నికల వేళ జనానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక టీడీపీ నేతలు అవస్తలు పడుతున్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు ఇంకా వెలుగులోకి వస్తే… చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అటు వైసీపీ నేతలు చెబుతున్నారు.