టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

ap-education-ministry-crucial-propositions-tenth-and-inter-exams-cm

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖకు కీలక ప్రతిపాదనలు అందాయి. ప్రస్తుతానికి కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చాయి. 

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో ఇందుకు సంబంధించి ప్రకటన రానుంది. కాగా జులై 7 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్‌ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయి. మరోవైపు సెప్టెంబర్‌ 2 లోపు టెన్త్‌ ఫలితాలు వెల్లడించనున్నారు.