హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి అజార్ తొలగింపు

azharuddin-removed-from-presidents-post-of-hyderabad-cricket-association

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అపెక్స్ కౌన్సిల్ బుధవారం సాయంత్రం సమావేశమై, అజారుద్దీన్‌ను తొలగించే నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్న తరువాత ఈ విషయం వెల్లడించారు. ఆయనపై పెండింగ్‌లో ఉన్న కేసులను చూపుతూ అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

కౌన్సిల్ అజార్  సభ్యత్వాన్ని కూడా నిలిపివేసిందని  షోకాజ్ నోటీసులను అందించినట్లు కూడా తెలిసింది. అజారుద్దీన్ 2019 సెప్టెంబర్ 27న హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, అప్పటినుండి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ప్యానెల్ ను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు హెచ్‌సిఎ సభ్యులు ఆరోపించారు.