కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై

basavaraj-bommai-take-oath-chief-minister-karnataka

కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులో రాజ్ భవన్ లో గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా మంగళవారం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుంకుంది.  మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు.