ఏపీలో 14 ‘దిశ కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

centre-ok-disha-centres-districts-ap-says-smriti-irani

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ‘దిశ’ కేంద్రం శుభవార్త తెలిపింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు.