రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచుతున్నారు : చంద్రబాబు

chandrababu fire on cm ys jagan over padday money

ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ప్రతిపక్షనేత చంద్రబాబు.. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారినే నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని ఆయన వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా డబ్బు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.