నేడు జగన్నన్న విద్యా దీవెన నిధులు జమ

cm-jagan-to-release-jagananna-vidya-deevena-funds-today

జగన్నన్న విద్యా దీవెన రెండవ దశ నిధులను అర్హతగల విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. సిఎం జగన్ తన తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రూ.693.81 కోట్ల నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా 10.97 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 

జగన్నన్న విద్యా దీవెన ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడం తోపాటు.. ఆలస్యం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది జగన్ సర్కార్. ఇప్పటి వరకు వైయస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగానికి రూ.26,677.82 కోట్లు ఖర్చు చేసింది.