పాఠశాలల్లో మొదటి దశ నాడు-నేడు సంపూర్ణం

cm-ys-jagan-mohan-reddy-review-meeting-nadu-nedu-schools

పాఠశాలల్లో నాడు-నేడు పనులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే మొదటి దఫా నాడు-నేడు సంపూర్ణం అయింది.. మొత్తం 15715 పాఠశాలల ఆధునీకరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.. సకల సౌకర్యాలతో దేశంలోనే రోల్‌మోడల్‌గా బడుల నిర్మాణం జరిగింది. ఇందుకోసం రూ.3 వేల మూడు వందల కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి.