డీసీసీబీ చైర్మన్‌ కన్నుమూత

dccb-chairman-passaway-adilabad

దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం గుంజాల గ్రామానికి చెందిన నాందేవ్‌ బుధవారం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. నాందేవ్‌ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రాత్రికి స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే బుధవారం అస్వస్థతగా ఉండడంతో హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు.. అయితే చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపట్ల నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.