ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం

fire-breaks-out-aiims-delhi-convergence-block-\

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కన్వర్జెన్స్ బ్లాక్ వద్ద బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు.  26 ఫైర్ టెండర్లు సంఘటన స్థలానికి చేరుకొని.. గంటా ముప్పై నిమిషాల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, భవనంలోని కోవిడ్ -19 ప్రయోగశాల పూర్తిగా ధ్వంస అయిందని ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి ధృవీకరించారు. కొన్ని ప్రయోగశాలలు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అదృష్టశావత్తు ఈ  భవనంలో రోగులు లేరని ఆయన అన్నారు.. కాగా కన్వర్జెన్స్ బ్లాక్ భవనంలో ఎక్కువగా ప్రయోగశాలలు, పరీక్షా విభాగం ఉన్నాయి.