కృష్ణా జలాలు : సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ

Krishna waters: Telangana withdraws petition filed in Supreme Court

కృష్ణా నదీ జలాల పంపకంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గతంలో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. అపెక్స్ కౌన్సిల్ లో తీర్మానం మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుంది. కృష్ణా జలాల్లో సరైన వాటా లేదనే అభ్యంతరాలతో కేసు వేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇదే విషయాన్నీ కృష్ణా జలాల వాటా కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కోరింది. అయితే సుప్రీంకోర్టు లో కేసు వేసిన నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది.