కనెక్ట్‌ టు ఆంధ్రకి లారస్‌ ల్యాబ్స్‌ భారీ విరాళం

laurus-labs-donated-4-cr-cmrf-nadu-nedu-programme

నాడు నేడు పథకం రెండో విడత కార్యక్రమానికి భారీ విరాళం అందింది. ‘కనెక్ట్‌ టు ఆంధ్ర’కు ప్రముఖ సాఫ్ట్ వెర్ సంస్థ లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం అందించింది. నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కోసం లారస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెక్కుతో పాటు పనులకు సంబంధించిన పత్రాలను అందజేశారు.. లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు సీఎం జగన్‌కు తెలిపారు. కార్యక్రమంలో కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈఓ వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.