మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియామకం

microsoft-names-ceo-satya-nadella-as-chairman

మైక్రోసాఫ్ట్‌కు చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియామకం అయ్యారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న ఆయనకు చైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు అప్పగించింది. బోర్డు చైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సంస్థ వెల్లడించింది. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు.