బాబు అను‘కుల’ మీడియా కుతంత్రాలు చేస్తోంది : ఎంపీ విజయసాయి

mp-vijayasai-reddy-comments-yellow-media

తెలుగుదేశం అనుకూల మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో ఇలా పేర్కొన్నారు. 'ఒక దురుద్దేశ భావనను నిజం అని చూపించడానికి బాబు అను’కుల మీడియా చేస్తున్న కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా ఉంటున్నాయి. ఢిల్లీలో జగన్ గారు చేసిన అభ్యర్థనలను కేంద్రం తిరస్కరిస్తే బాగుండనే దుర్మార్గపు ఆలోచనలను ఏమనాలి? అలా అనుకోవడం ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవడమే.' అని పేర్కొన్నారు. 

ఇదిలావుంటే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతి రాజును మళ్లీ నియమించాలన్న హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన వల్లే సింహాచలం పంచ గ్రామాల్లో సమస్య తలెత్తిందని విమర్శించారు. త్వరలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు.