శ్రీశైలంలో పది గేట్లు ఎత్తి నీరు విడుదల

Ten gates were raised in Srisailam and water was released

శ్రీశైలం రిజర్వాయర్ లో14 సంవత్సరాల తరువాత జులైలో సుందర దృశ్యం దర్శనమిచ్చింది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు రెండవ వారం నంచి గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతారు.. అయితే ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో 15 రోజుల ముందుగానే ప్రాజెక్టులోకి 200 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఈ క్రమంలో గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.