మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

tension-prevails-krishna-district-g-konduru-mandal

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు జగనన్న కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పేదలకు గడ్డమణుగులో ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అసత్యపు ప్రచారం చేశారు.

తన అనుచరులతో ఇళ్ల స్థలాల వద్దకు చేరుకున్న ఉమా.. నియోజకవర్గ ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైసీపీ నాయకులు కూడా ఉమాని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటుతుందేమో అని పోలీసులు దేవినేని ఉమని అక్కడినుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు.