ఉత్తర ప్రదేశ్‌లో మహభారతం సీన్ రిపీట్.. గంగానదిలో కొట్టుకొచ్చిన చిన్నారి

uttar-pradesh-baby-girl-floating-in-ganga-river-rescued

ఉత్తర ప్రదేశ్‌లో మహభారతంలో కుంతీదేవి కర్ణుడిని పెట్టెలో పెట్టి వదిలి ఘటనను తలుచుకుందో ఏమో కానీ ఆ తల్లి దుప్పట్లో చుట్టిన తన బిడ్డను చెక్కపెట్టెలో పెట్టి  భద్రంగా గంగానదిలో విడిచిపెట్టింది. ఘాజిపూర్ జిల్లాలోని గంగా నదిలో చెక్క పెట్టెలో ఉంచిన 21 రోజుల ఆడపిల్ల బుధవారం తేలుతూ కనిపించింది. దీంతో శిశువును రక్షించాడు బోటు డ్రైవర్.. అనంతరం పోలీసులు ఆ పసిపాపను ఆశా జ్యోతి కేంద్ర అనాథాశ్రమానికి పంపించి ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

ఖాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దాద్రి ఘాట్ సమీపంలో శిశువు నదిలో తేలుతూ కనిపించింది. శిశువు ఏడుపు శబ్దం.. ఒక పడవ డ్రైవర్ దృష్టిని ఆకర్షించింది, ఆ తరువాత అతను ఆ పెట్టెను కనిపెట్టాడు. లోపల, శిశువును ఎరుపు వస్త్రంలో చుట్టి, హిందూ దేవతలు మరియు దేవతల ఫోటో ఫ్రేమ్‌లతో పెట్టె లోపలా అలంకరించబడి ఉంది. అంతేకాదు అందులో శిశువు పుట్టిన చార్ట్ కూడా ఉంది.

 మొదట్లో ఆ బోట్ మాన్ శిశువును తన ఇంటికి తీసుకువెళ్ళాడు, ఈ క్రమంలో అతని కుటుంబం ఆ పసిపాపను దత్తత తీసుకోవాలనుకుంది. అయితే స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి అనాథాశ్రమానికి తీసుకెళ్లారు, ఆ తరువాత విచారణను ప్రారంభించారు.